టీడీపీకి షాక్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి?

by srinivas |   ( Updated:2020-05-26 07:23:29.0  )
టీడీపీకి షాక్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి?
X

దిశ, ఏపీ బ్యూరో: మహానాడుకు ముందే టీడీపీకి షాక్ తగులుతుందా? టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ గూటికి చేరనున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పార్టీ మారనున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. దీంతో వైసీసీలో వీరి చేరిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed