- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ బిల్లు కట్టలేనివాళ్లు రాజధాని కడుతారా: టీడీపీ ఎమ్మెల్యే
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని రాజధాని రైతులు 614 రోజులుగా చేస్తున్న పోరాటం సీఎం జగన్‌కు కనిపించడం లేదా అని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మాటతప్పడం సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్‌పై జగన్ కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదన్నారు. మూడు రాజధానులంటూ ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని విరుచుకుపడ్డారు. సచివాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాననడం హాస్యాస్పదమన్నారు.
అమరావతి నిలుపుదలతో రూ.2 కోట్ల సంపద నిరర్థకంగా మారిపోయిందన్నారు. దీన్ని వినియోగించుకుంటే నేడు ప్రజల నెత్తిన ఇష్టానురీతిలో పన్ను భారాలు పడేవి కాదన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. రాజధాని నిర్వీర్యంతోనే రాష్ట్రం అప్పులపాలైందన్నారు. నేటికి మూడు ప్రాంతాల్లో మూడు గోడలు కూడా కట్టలేదు. విశాఖలో దోచుకున్న భూముల కోసం రాజధాని తరలింపును చేపట్టారు. విశాఖ ప్రజలు కూడా వైసీపీ దోపిడీకి బెంబేలెత్తున్నారని చెప్పుకొచ్చారు. శని, ఆదివారాలు వస్తే విధ్వంసమే విధిగా రెచ్చిపోతున్నారంటూ ధ్వజమెత్తారు.
అమరావతిలోని నిర్మాణాలకు చెదలెక్కిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాజధాని నడిబొడ్డున పేదలకు నిర్మించిన ఇళ్లను తక్షణమే అందించాలి. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి, యువతకు మేలు చేకూర్చే వ్యక్తి అయితే రాజధానిని తరలించకూడదన్నారు. వెనకబడిన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోవడం జగన్ తెలివితక్కువ తనానికి నిదర్శనమని విమర్శించారు. మూడు రాజధానులతో నష్టపోయామని ఆదేశ ప్రతినిధులే వాపోతున్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి జరగడం అసాధ్యం. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుపై రైతులదే అంతిమ విజయం అవుతుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.