బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసింది

by srinivas |
బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసింది
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో బీసీలకు జగన్ సర్కారు అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను 16 నెలలుగా చూస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 25 శాతానికి తగ్గించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చి నియమించిన 300 మంది సలహాదారుల్లో బలహీన వర్గాలకు చెందిన వారెవరూ లేరన్నారు. బడుగు బలహీన వర్గాలపై పేటెంట్ ఎవరికైనా ఉందంటే అది టీడీపీకి మాత్రమే ఉందని నిమ్మల స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed