- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్పీకర్ తమ్మినేనితో గంటా భేటీ… రాజీనామాపై చర్చ

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను స్పీకర్ ఇప్పటి వరకు ఆమోదించలేదు. దీంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శ్రీకాకుళంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు.
అయితే రాజీనామా అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తమ్మినేని సీతారాం తెలిపారు. గంటా తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారని చెప్పుకొచ్చారు. గంటా తనకు చిరకాల మిత్రుడు అని.. గతంలో టీడీపీ, పీఆర్పీలో కలిసి పనిచేసినట్లు గుర్తు చేశారు. ఈ భేటీలో తన రాజీనామాను ఆమోదించాలని గంటా కోరారని చెప్పుకొచ్చారు. గతంలో ఇచ్చిన రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదని దీంతో మరోసారి రాజీనామా లేఖ అందజేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.