- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: టీడీపీ నేతలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల అయినా 24 గంటల్లోనే మరోసారి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన పయ్యవుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రాజకీయ కక్షతోనే జేసీ ప్రభాకర్ రెడ్డిని మరోసారి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. బెయిల్‌పై వచ్చిన 24 గంటల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత చర్యగా భావిస్తున్నామని పయ్యవుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. టీడీపీ నేతలపై ప్రభుత్వం వరుసగా కేసులు పెడుతుందని.. ప్రతి పక్షాల పట్ల కక్ష పూరిత ధోరణి వీడాలని వారు డిమాండ్ చేశారు.
Next Story