పెద్దిరెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు

by srinivas |
TDP logo
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ సెక్రటరీని టీడీపీ నేతలు శనివారం కలిశారు. మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

కాగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాల నిలిపివేయాలని నిమ్మగడ్డ రమేశ్ ఆదేశాలు జారీ చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలనీ, లేకపోతే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను పాటించే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డిని తాను చెప్పే వరకు గృహనిర్బంధంలో ఉంచాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story