- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మేలుకో.. పేదలను ఆదుకో
దిశ, హుస్నాబాద్: కేసీఆర్ మేలుకోని కరోనా మహమ్మారి నుంచి పేద ప్రజలను ఆదుకోవాలని టీడీపీ కరీంనగర్ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ఆందోళనకు చేపట్టారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రికి పోతే సౌకర్యాలు లేకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తే ఇళ్ళు, వాకిలి అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తోందన్నారు.
కరోనా వైరస్ కట్టడిపై వైద్య ఆరోగ్యశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తిరుపతి, శ్రీనివాస్, శంకర్, మల్లేశం, ఆంజనేయులు, వెంకటేష్, రాజు, ఎండి హసన్ తదితరులు పాల్గొన్నారు.