'ఆ ఘనత మీదే'

by srinivas |
ఆ ఘనత మీదే
X

దిశ, అమరావతి బ్యూరో: న్యాయ వ్యవస్థలో ఎవరూ పరిధి దాటకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారని, కానీ ఇప్పటికే కార్యనిర్వాహకశాఖను మీరే నిర్వీర్యం చేశారని సోమిరెడ్డి మండిపడ్డారు. గురువారం న్యాయ వ్యవస్థపై తమ్మినేని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నియంతృత్వ నిర్ణయాలు, కక్ష సాధింపులతో అభివృద్ధి, ప్రజల భవిష్యత్ ప్రశార్థకం అవుతుందన్నారు. ఇలాంటి సమయంలో స్పీకర్ న్యాయ వ్యవస్థను బెదిరించడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్య విధానానికి అతీతమని అనుకుంటున్నారేమోనని విమర్శించారు.

Advertisement

Next Story