జగన్ ఆరు నెలల్లోనే చేశాడు : పట్టాభిరామ్

by srinivas |
జగన్ ఆరు నెలల్లోనే చేశాడు : పట్టాభిరామ్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఐదేళ్లో చేసిన అప్పును, వైసీపీ ఏడాదిలోనే చేసిందని విమర్శించారు. కాగ్ నివేదిక జగన్ అప్పులను బహిర్గతం చేస్తోందని తెలిపారు. తమిళనాడు, తెలంగాణ కలిపి చేసినంత అప్పు.. గత ఆరునెలల్లోనే జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా ఉంటే 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు రూ.45,472కోట్లకు పెరిగిందని వెల్లడించారు.

Advertisement

Next Story