- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అవినీతి పరుల్ని వదిలేసి నా వెంటపడుతున్నారు’
దిశ, ఏపీ బ్యూరో: 108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, సుమారు రూ.300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. 2016లో టీడీపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా టెండర్లు పిలిచి బీవీజీ సంస్థకు టెండర్లు అప్పగించగా… వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమాత్రం అనుభవంలేని అరబిందో ఫౌండేషన్‌కు అంబులెన్స్‌ల నిర్వహణ అప్పగించారని ఆరోపించారు. అరబిందో ఫౌండేషన్‌కు కొత్త అంబులెన్స్‌కు అయితే నెలకు రూ.1,78,072, పాత అంబులెన్స్ అయితే నెలకు రూ.2,21,257 రేట్ల చొప్పున కట్టబెట్టారని వెల్లడించారు.
ఈ అరబిందో ఫౌండేషన్ ఎవరిదని ఆరా తీస్తే, వైఎస్ జగన్ ఆత్మబంధువుగా పేర్కొన్న విజయసాయిరెడ్డికి స్వయానా వియ్యంకుడు పీవీ రాంప్రసాద్ రెడ్డికి చెందినదని తెలిసిందని పట్టాభిరామ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిరామ్‌ని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నేటి ఉదయం నుంచి పట్టాభిరామ్‌ని పోలీసులు నీడలా వెన్నాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై ఆధారాలు బయటపెడితే పోలీసులు విజయసాయిరెడ్డి ఇంటి వద్దకు వెళతారని భావించాను కానీ.. తన వద్దకు వస్తారని అనుకోలేదన్నారు. పోలీసులు తప్పు చేసిన వాళ్ల వద్దకు వెళ్లాల్సిందిపోయి.. అవినీతిని బహిర్గతం చేసిన తన ఇంటికి రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన తెలిపారు.