అనిల్ యాదవ్ ఓడిపోయే వరకు అరగుండు, సగం మీసంతోనే ఉంటా: టీడీపీ సీనియర్ నేత

by Shyam |   ( Updated:2021-11-18 02:34:57.0  )
అనిల్ యాదవ్ ఓడిపోయే వరకు అరగుండు, సగం మీసంతోనే ఉంటా: టీడీపీ సీనియర్ నేత
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఒక్కస్థానంలో కూడా గెలవలేదు. నెల్లూరు కార్పొరేషన్‌లో 49,50 డివిజన్లను టీడీపీ సీనియర్ నేత కప్పిర శ్రీనివాసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతే అరగుండు గీయించుకుంటానని, సగం మీసంతో ఉంటానని సవాల్ చేశాడు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఓడిపోయేంత వరకు ఇలానే ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఎన్నికల ప్రచారంలో చేసిన సవాల్ మేరకు కప్పిర శ్రీనివాసులు అర గుండు గీయించుకున్నారు. సగం మీసం తీసేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్, అశ్విని యాదవ్‌లు.. మొత్తం 400 మంది నాయకులను 50 డివిజన్‌లో దించి తమ అభ్యర్థులను ఓడించేందుకు రూ.3కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ ఓడిపోయే వరకు ఇలానే ఉంటానని.. జగన్ పోవాలి చంద్రబాబు రావాలని కప్పిర శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story