- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వందల కోట్ల కోసం కక్కుర్తి: దేవినేని
దిశ, వెబ్‌డెస్క్: గత పదిహేను నెలలుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రభుత్వ వైఫల్యాలు, చేతగాని తనాన్ని టీడీపీ ప్రశ్నిస్తుంటే జగన్ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని దేవినేని ఉమ అన్నారు. ఉచిత విద్యుత్‌ను తీసేసి.. మీటర్ల పేరుతో రైతులకు ఉరి వేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ సున్నీ వడ్డీన సున్నా చేశారని.. రుణాలు తీసుకుంటున్న రైతుల నుంచి వడ్డీలు వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు.
సంపద సృష్టించడం చేతగాక, పరిపాలన చేయలేక రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల పాలు చేశారని దేవినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన ద్వారానే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ సాధ్యమైందన్నారు. వైఎస్ హయాంలో కూడా సరిపడ డబ్బులు ఖర్చుపెట్టలేకనే కరెంట్ కోతలు పెట్టారని చెప్పారు. ఆ తర్వాత 5 ఏండ్లు పాలించిన టీడీపీ, చంద్రబాబుతోనే మళ్లీ కరెంట్ కష్టాలు తీరాయన్నారు. అది చేతగాక నే కమీషన్లకు కక్కుర్తి పడి.. మీటర్ల పేరుతో వందల కోట్ల అవినీతి చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.