కమ్మ కులంలో పుట్టితే బానిసలుగా బతకాలా?

by srinivas |
కమ్మ కులంలో పుట్టితే బానిసలుగా బతకాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ ఫైర్ అయ్యారు. జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగి చాలా కాలమైనా.. ఇప్పటి వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. కానీ.. రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో ప్రభుత్వం మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని విమర్శించారు.

రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం కమ్మ కులం కావడంతోనే టార్గెట్ చేస్తున్నారని రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ కులంలో పుట్టినందుకు బానిసలుగా బతకాలా? అని ప్రశ్నించారు. రమేశ్ ఆసుపత్రి కేసులో మహిళను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారణ జరపడం దారుణమన్నారు. ఎల్జీ పాలీమర్స్ కేసులో మాత్రం నామమాత్రంగా సోదాలు నిర్వహించారని రాజేంద్రప్రసాద్ విమర్శించారు.

Advertisement

Next Story