అహంకారంతోనే మూడు ముక్కలాట: దేవినేని

by srinivas |
అహంకారంతోనే మూడు ముక్కలాట: దేవినేని
X

వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలున్నారన్న అహంకారంతో రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, జగన్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తే.. అమరావతిని పూర్తిగా చంపేసి వైజాగ్ దుకాణం మారుస్తారని ఆయన ఆరోపించారు. వైజాగ్‌లో ఆయన ఇప్పటికే ఇళ్లను చూసుకున్నారని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ అల్టిమేటం జారీ చేశారని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో విఫలమైతే వారు రాజీనామా లేఖలు ఇవ్వాలన్న వ్యాఖ్యలు జగన్‌లోని అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయని ఆయన చెప్పారు.

అవకాశవాద రాజకీయ నాయకుల మాటలను ప్రజలు వినొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటే టీడీపీని గెలిపించాలని ఆయన సూచించారు.

tags : tdp, devineni uma, vijayawada, local body elections

Advertisement

Next Story