- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రైమాసిక ఫలితాల్లో 15 శాతం వృద్ధి సాధించిన టీసీఎస్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో 14.9 శాతం వృద్ధితో రూ. 9,246 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 8,049 కోట్లను ఆర్జించింది. అలాగే, సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 9.4 శాతం పెరిగి రూ. 43,705 కోట్లుగా వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 12 నెలల కాలంలో క్లౌడ్ టెక్నాలజీ వైపునకు డిమాండ్ పెరగడంతో డిజిటల్ సేవలు భారీగా ఊపందుకున్నాయి. దీనివల్లే కంపెనీ ఆదాయం అధికంగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక, కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 15 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. రూ.8,118 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. ‘ గడిచిన దశాబ్దంలో కంపెనీ పెట్టుబడులు సామర్థ్యాలను పెంచేందుకు, రీసెర్చ్, ఇన్నోవేషన్ కోసం పెట్టాము. ఇదే ధోరణిని మున్ముందు కూడా కొనసాగిస్తామని’ టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు.