- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ ఇండియా కోసం టాటా గ్రూప్ ఆసక్తి !
దిశ, వెబ్‌డెస్క్: అప్పుల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. గత వారాంతంలో ఎయిర్ ఇండియాను కొనేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ను దాఖలు చేసినట్టు సమాచారం. సోమవారంతో బిడ్‌ల దాఖలుకు చివరి గడువు ఉన్న నేపథ్యంలో టాటా గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేసింది. అర్హత పొందితే రాబోయే రెండు వారాల్లో ఫైనాన్షియల్ బిడ్‌ను సమర్పించే అవకాశముంటుంది. అయితే, ఈ అంశంపై స్పందించేందుకు టాటా గ్రూప్ నిరాకరించింది.
ప్రస్తుత ఎయిర్ ఇండియాను 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో టాటా గ్రూప్ సంస్థే స్థాపించింది. అనంతరం 1953లో ప్రభుత్వ సంస్థగా మారింది. ఇన్నేండ్ల తర్వాత మళ్లీ సొంత సంస్థను కొనేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. ఇదే సమయంలో బిడ్డింగ్ చివరి రోజు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న దాదాపు 200కు పైగా ఉద్యోగులు ఎయిర్ ఇండియాలో 51 శాతం వాటా కోసం ఆసక్తి వ్యక్తీకరణను దాఖలు చేశారు. వీరందరికీ ఎయిర్ ఇండియా డైరెక్టర్ మీనాక్షి మల్లిక్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ అంశాన్ని ఆమె ధృవీకరించారు.