బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో టాటా మోటార్స్ భాగస్వామ్యం!

by Harish |
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో టాటా మోటార్స్ భాగస్వామ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: కమర్షియల్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు టాటా మోటార్స్ సోమవారం ప్రకటించింది. దేశీయంగా దిగ్గజ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, సహా ఇతర బ్యాంకులు, ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. వీటితో పాటు పలు ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలతో ఈ ఒప్పందం జరిగినట్టు పేర్కొంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో కంపెనీ చేసుకున్న వ్యూహాత్మక ఒప్పందం నేపథ్యంలో కొత్తగా కొనుగోలు చేసేవారితో పాటు ప్రీ-ఓన్‌డ్ కమర్షియల్ వాహనాలను కొనే కస్టమర్లకు ఆర్థిక అవసరాలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉన్నట్టు కంపెనీ వివరించింది. ‘కంపెనీ భాగస్వామ్యం వినియోగదారులకు ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు వీలవుతుంది. దీనివల్ల కంపెనీ సమర్థవంతమైన సేవలను అందించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్టు’ టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల సేల్స్, మార్కెటింగ్ వైస్-ప్రెసిడెంట్ రాజేష్ కౌల్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed