వాహన రుణాల అందించేందుకు టాటా మోటార్స్, బంధన్ బ్యాంకు ఒప్పందం!

by Harish |
tata motors
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వినియోగదారులకు రుణ సహాయం చేసేందుకు బంధన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా టాటా మోటార్స్ కస్టమర్లకు బంధన్ బ్యాంకు 7.5 శాతం వడ్డీకే రుణాలను అందజేయనుంది.

కొనుగోలు చేసే వాహనం మొత్తం ఆన్‌రోడ్ ధరపై గరిష్ఠంగా 90 శాతం ఫైనాన్స్ లభిస్తుంది. వినియోగదారులు ఏడేళ్ల వరకు రీపేమెంట్ కాలవ్యవధితో ప్రత్యేక ఈఎంఐ సౌకర్యాలు కూడా పొందవచ్చని టాటా మోటార్స్ పేర్కొంది. అంతేకాకుండా జీరో ఛార్జీల వంటి ఇతర ప్రయోజనాలు అందించనున్నట్టు బంధన్ బ్యాంకు పేర్కొంది. ‘ఇరు సంస్థల మధ్య జరిగిన ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లు సులభంగా, ఇబ్బందుల్లేకుండా ఫైనాన్స్ తీసుకోవడానికి వీలవుతుందనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం వైస్-ప్రెసిడెంట్ రాజన్ చెప్పారు. ఈ ఆఫర్ టాటా కార్లను కొనాలనుకునే వారికి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుందని కంపెనీ వెల్లడించింది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story