75 ఏండ్లు పూర్తి చేసుకున్న టాటా మోటార్స్!

by Harish |
75 ఏండ్లు పూర్తి చేసుకున్న టాటా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వాహన రంగంలో మెరుగైన ప్రయాణాన్ని కలిగిన దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1945లో జేఆర్‌డీ టాటా సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ‘ఫౌండర్స్ ఎడిషన్’ పేరుతో కార్లను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లనే ‘ఫౌండర్స్ ఎడిషన్’ వెర్షన్‌ను లాంచ్ చేసింది. కానీ, ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు అందరికీ అందుబాటులో ఉండవని, కేవలం టాటా గ్రూప్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఫౌండర్స్ ఎడిషన్ కార్లలో నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్ లోగోను కంపెనీ అమర్చింది. మిగిలిన అన్ని ఫీచర్లు యథాతథంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది.

టాటా మోటార్స్ ప్రయాణం…

* 1945లో టాటా మోటార్స్ కంపెనీని లోకోమోటివ్ తయారీదారుగా ప్రారంభమైంది.

* 1954లో జర్మనీకి చెందిన దైంలర్-బెంజ్‌తో జాయింట్ వెంచర్‌గా వాణిజ్య వాహన రంగంలోకి ప్రవేశపెట్టారు.

* 1991లో ప్యాసింజర్ వాహనాల విభాగంలోకి ప్రవేశం. అదే ఏడాదిలో మొదటి స్పోర్ట్ యుటిలిటీ వాహనం టాటా సియెరా విడుదల చేశారు.

* తర్వాత 1992లో టాటా ఎస్టేట్, 1994లో టాటా సుమో, 1998లో టాటా సఫారి మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

* 2004లో దక్షిణ కొరియాకు చెందిన ట్రక్ తయారీ యూనిట్ డేవూను కొనుగోలు చేసింది.

* 2005లో టాటా మోటార్స్ స్పానిష్ బస్సు, కోచ్ తయారీ కంపెనీ హిస్పనో సంస్థలో వాటాలను సొంత చేసుకుంది.

* 2008లో ఫోర్డ్ మోటార్ కంపెనీ నుంచి జాగ్వా అండ్ ల్యాండ్ రోవర్ కార్ల తయారీ కంపెనీని కొనుగోలు చేసింది.


Advertisement

Next Story