- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గింపు హర్షదాయకం: రాజేశ్వర్
దిశ, జడ్చర్ల: దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం హర్షదాయకమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తుంది అనడానికి నేడు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడమే అందుకు నిదర్శనమని బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, తిరుపతమ్మ అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించి ప్రజల పక్షాన నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులను బద్నాం చేసే పనిలో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారని మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూశారని.. కానీ, హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, నాయకులకు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం విధించిన పన్నులను తగ్గించి పేద ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెప్పక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతి, సీనియర్ నాయకులు రవి గౌడ్, వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- mahaboobnagar