- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాచల్‌పై తమిళనాడు అద్బుత విజయం
దిశ, స్పోర్ట్స్ : తమిళనాడు ముందు ఛేదించదగిన లక్ష్యమే ఉంది. కానీ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. బాబా అపరాజిత్ ఒక్కడే మరో ఎండ్‌లో పోరాటం చేస్తున్నాడు. ఆదుకుంటాడనుకున్న దినేష్ కార్తీక్ విఫలమయ్యాడు. ఇక మ్యాచ్ హిమాచల్ చేతిలోకి వెళ్లిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే షారుక్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి బాబా అపరాజిత్ కూడా తోడవడంతో తమిళనాడు రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్ చేరింది.
హిమాచల్‌ప్రదేశ్ నిర్దేశించిన 136 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టుకు సరైన శుభారంభం దక్కలేదు. హిమాచల్ బౌలర్ వైభవ్ అరోరా ధాటికి కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు హరి నిషాంత్ (17), ఎన్ జగదీషన్ (7), అరుణ్ కార్తీక్ (0) లను వైభవ్ అరోకా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో బాబా అపరాజిత్, సోను యాదవ్ (16) కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. అయితే జైస్వాల్ బౌలింగ్‌లో సోనూ యాదవ్ (16) నితిన్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ దినేష్ కార్తీక్ (2) మయాంక్ దగర్ బౌలింగ్‌లో చోప్రాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి తమిళనాడు స్కోర్ 66/5. ఒకవైపు చేయాల్సిన పరుగులు భారీగా ఉన్నాయి. రన్‌రేట్ కూడా భారీగా ఉంది. ఇక మ్యాచ్ హిమాచల్ గెలిచనట్లే అని అందరూ అనుకున్నారు. కానీ బాబా అపరాజిత్, షారుక్ ఖాన్ కలసి హిమాచల్ బౌలర్లను చితకబాదారు. ముఖ్యంగా షారుక్ బౌండరీలు, సిక్సులు బాదుతూ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరూ కలసి అజేయంగా 32 బంతుల్లో 65 పరుగులు జోడించారు. అపరాజిత్ చివర్లో సిక్సు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అపరాజిత్ (52), షారుఖ్ ఖాన్ (40) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 141 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో రెండో క్వార్టర్ ఫైనల్‌లో హిమాచల్ ప్రదేశ్ పైన గెలిచి సెమీస్‌లో అడుగు పెట్టింది. వైభవ్ అరోర 3 వికెట్లు తీయగా, పంకజ్ జైస్వాల్, మయాంక్ దగర్ చెరో వికెట్ తీశారు.
ఆదుకున్న రిషి ధావన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్‌ప్రదేశ్ ఓపెనర్లు ధాటిగా ప్రారంభించారు. ఓపెనర్లు అభిమన్యు రానా, చోప్రా కలసి తొలి వికెట్‌కు 24 పరుగులు జోడించారు. అయితే సోను యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతికి చోప్రా (6) బౌల్డ్ అయి పెవీలియన్ చేరాడు. వరుసగా బౌండరీలు కొడుతూ పరుగుల వేగం పెంచుతున్న అభిమన్యు రానా (28) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. మురుగన్ అశ్విన్ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో అభిమన్యు అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితిన్ శర్మ (26), ఆర్ఐ ఠాకూర్ (16) కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 29 పరుగులు జోడించారు. సందీప్ వారియర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ మూడో బంతికి నితిన్ శర్మ (26) అరుణ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషి ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో నిలబడతాడు అనుకున్న ఆర్ఐ ఠాకూర్ (16) సాయి కిషోర్ బౌలింగ్‌లో అపరాజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. రిషి ధావన్(35 నాటౌట్) ఒకవైపు దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి మరోఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. ధావన్ చివరి వరకు ఒంటరి పోరాటం చేసినా.. లోయర్ మిడిల్ ఆర్డర్, టెయిలెండర్లు చేతులెత్తేయడంతో హిమాచల్‌ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సోను యాదవ్ 3, సందీప్ వారియర్ 2 వికెట్లు తీయగా, సాయి కిషోర్, మొహమ్మద్ చెరో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు
అభిమన్యు రానా (రనౌట్) 28, చోప్రా (బి) సోనూ యాదవ్ 6, నితిన్ శర్మ (సి) అరుణ్ కార్తీక్ (బి) సందీప్ వారియర్ 26, ఆర్ఐ ఠాకూర్ (సి) అపరాజిత్ (బి) సాయి కిషోర్ 16, రిషి ధావన్ 35 నాటౌట్, ఆయుష్ జమ్వాల్ (బి) సోను యాదవ్ 3, పి జైస్వాల్ (సి) అరుణ్ కార్తీక్ (బి) సందీప్ వారియర్ 7, ఏక్‌నాథ్ సేన్ (సి) కార్తీక్ (బి) సోనూ యాదవ్ 5, దిగ్విజయ్ రంగీ (రనౌట్) 0, మయాంక్ దగర్ (సి) అరుణ్ కార్తీక్ (బి) మహమ్మద్ 1, వైభయ్ అరోర 0 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లు) 135/9
వికెట్ల పతనం : 1-24, 2-39, 3-68, 4-99, 5-109, 6-120, 7-126, 8-127, 9-130
బౌలింగ్ : సందీప్ వారియర్ (4-0-32-2), సోనూ యాదవ్ (4-1-14-3), బాబా అపరాజిత్ (2-0-13-0), సాయి కిషోర్ (4-0-27-1), మురుగన్ అశ్విన్ (4-0-30-0), మహమ్మద్ (2-0-18-1)
తమిళనాడు
హరి నిషాంత్ (బి) వైభవ్ అరోరా 17, ఎన్ జగదీషన్ (బి) వైభవ్ అరోర 7, బాబా అపరాజిత్ 52 నాటౌట్, అరుణ్ కార్తీక్ (బి) వైభవ్ అరోరా 0, సోనూ యాదవ్ (సి) నితిన్ శర్మ (బి) పి జైస్వాల్ 16, దినేష్ కార్తీక్ (సి) చోప్రా (బి) మయాంక్ దగర్ 2, షారుక్ ఖాన్ 40 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.5 ఓవర్లు) 141/5
వికెట్ల పతనం : 1-18, 2-25, 3-25, 60-4, 66-5
బౌలింగ్ : రిషి ధావన్ (3-0-30-0), వైభవ్ అరోరా (4-1-30-3), పంకజ్ జైస్వాల్ (2.5-0-25-1), మయాంక్ దగర్ (4-0-24-1), ఆయుష్ జమ్వాల్ (4-0-28-0)