తమిళనాడు CM స్టాలిన్ సంచలన ప్రకటన.. ‘దేశం గర్వించదగ్గ విషయం’..

by Anukaran |   ( Updated:2021-11-19 06:15:06.0  )
తమిళనాడు CM స్టాలిన్ సంచలన ప్రకటన.. ‘దేశం గర్వించదగ్గ విషయం’..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా DMK పార్టీ అధినేత MK స్టాలిన్ ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన నిర్ణయాలను తమిళ ప్రజలు కూడా ముక్తకంఠంతో ఆహ్వానిస్తున్నారు. విద్యార్థుల చదువు విషయంలో గానీ, బ్యాంకింగ్, సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక ‘ఐటీ సెక్యూరిటీ వింగ్’ ఏర్పాటు విషయంలో గానీ ప్రత్యేక చొరవ చూపారు స్టాలిన్. ఇకపోతే అసెంబ్లీలో క్యాంటీన్ క్లోజ్ చేయడం.. ప్రజాధనం వృథా కావొద్దని ప్రజాప్రతినిధులు అందరూ ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకోవాలని స్టాలిన్ ప్రకటించడం అన్ని సంచలన నిర్ణయాలే. తాజాగా ఆయన మరోసారి దేశం గర్వించదగ్గ నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడులో ప్రజలు ఎవరైనా రోడ్డు ప్రమాదాల బారిన పడితే వారికి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఒక్క తమిళ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని స్టాలిన్ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో 81 ప్రాణాలు రక్షించే విధానాల కోసం రాష్ట్రం ఒక్కొక్కరికి రూ.1లక్ష వరకు కవర్ చేయనుందని తెలిపారు. ఈ విధంగా ట్రీట్మెంట్ అందించడం కోసం ఇప్పటికే 609 ఆస్పత్రుల్లో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. సీఎం స్టాలిన్ ప్రకటనపై తమిళ ప్రజలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed