- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంట్రెస్టింగ్ ‘సెక్యూరిటీ’ గార్డు స్టోరీ
దేశం నీకేం ఇచ్చిందని కాదు.. దేశానికి నువ్వు ఏమిచ్చావ్? అని ప్రశ్నించుకో. స్వతంత్ర భారతంలో నువ్వు ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నావ్.. ఎంత ఫేమస్ అయ్యావ్ .. ? అన్నది కాదు ఇంపార్టెంట్..దేశ రక్షణకు నీ వంతు సహాయం అందిస్తున్నావా? అనేది ముఖ్యం. సరే నువ్వు చేయలేకపోవచ్చు..కనీసం అలాంటి వారిని గుర్తించి గౌరవించండి..అనే సందేశంతో తెరకెక్కిన తమిళ్ షార్ట్ ఫిల్మ్ సెక్యూరిటీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సెలెబ్రిటీలు సైతం ఈ షార్ట్ ఫిల్మ్ గురించి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు.
లాక్‌డౌన్ విధించిన నుంచి లాక్ డౌన్ సడలింపు వరకు దేశంలో జరిగిన పరిస్ధితులను దేశభక్తికి జోడించి తెరకెక్కిన ఈ చిత్రం కన్నీరు పెట్టిస్తుంది. టిక్ టాక్ స్టార్ ఉండే ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డుగా వస్తాడు 50 ఏండ్ల వ్యక్తి. బయట నుంచి కారులో వచ్చిన ఆ టిక్ టాక్ స్టార్‌ను గుర్తుపట్టక పోయె సరికి ఆయన మీద ఫైర్ అవుతుంది. కానీ, క్లైమాక్స్‌లో తనే వచ్చి ఆయనను క్షమించమని కోరుతూ దండం పెడుతుంది. ఇంతకీ ఆయన ఎవరు?. దేశం కోసం తను ఏం చేశాడు? సెక్యూరిటీ గార్డు దేశం కోసం చేసిన త్యాగం ఏంటి? దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి? అనేది కథ.