గొప్ప వార్తతో నా రోజు మొదలైంది : తమన్నా

by Shyam |
గొప్ప వార్తతో నా రోజు మొదలైంది : తమన్నా
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. మీ నవ్వే మీకు ఎప్పటికి బెస్ట్ మేకప్ అవుతుందన్న తమన్నా భాటియా… ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా నవ్వుతూ సంతోషాన్ని వ్యాప్తి చేయాలని కోరింది. కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన సూత్రాలు పాటించాలని … ఇళ్లలోనే మిమ్మల్ని మీరు స్వీయ నిర్బంధంలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పైన చెప్పినవన్నీ నేను చేస్తున్నాను.. మీరు కూడా చేయాలని కోరుకుంటున్నానని చెప్పింది.

ఇక దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై స్పందించింది తమన్నా. ఒక గొప్ప వార్తతో నా రోజు మొదలైందని తెలిపింది. ఇన్నాళ్లకైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. వరల్డ్ హ్యాపినెస్ డే రోజు.. ఈ వార్త చాలా హ్యాపినెస్ ఇచ్చిందని తెలిపింది మిల్కీ బ్యూటీ.

Tags: Tamanna ,Nirbhaya,Gang Rape,Nirbhaya Convicts,Hanging



Next Story

Most Viewed