టీకా వేసుకున్నవారికి బ్యాంకుల ఆఫర్లు..

by Harish |   ( Updated:2021-06-08 06:50:53.0  )
టీకా వేసుకున్నవారికి బ్యాంకుల ఆఫర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో టీకా వేసుకోవడంపై అవగాహన పెంచేందుకు వివిధ బ్యాంకులు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కరోనా టీకా తీసుకున్న వినియోగదారులకు డిపాజిట్లపై అధికంగా వడ్డీ రేట్లను చెల్లిస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకులు చెబుతున్నాయి. టీకా తీసుకున్న ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న దాని కంటే అధికంగా వడ్డీని ఇవ్వనున్నట్టు, ఈ ఆఫర్ పరిమితకాలమే ఉంటుందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.

ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ ఎవరైన ఖాతాదారుడు కనీసం ఒక డోస్ కరోనా టీకా తీసుకుంటే 999 రోజుల కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 0.30 శాతం వడ్డీ అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బాటలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్’ ద్వారా కరోనా టీకా వేసుకున్న వినియోగదారులకు 1,111 రోజుల కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.25 శాతం వడ్డీని ఎక్కువగా చెల్లించనున్నట్టు వెల్లడించింది. సీనియర్ సిటిజన్‌లకు కూడా అదనంగా 0.50 శాతం వడ్డీ అందించనుంది.

Advertisement

Next Story