అమృతా సింగ్‌కు తాప్సీ కాంప్లిమెంట్

by Anukaran |   ( Updated:2020-07-18 02:03:38.0  )
అమృతా సింగ్‌కు తాప్సీ కాంప్లిమెంట్
X

సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటినా సరే, బాలీవుడ్‌కు వెళ్లేసరికి మాత్రం కాస్త తడబడుతుంటారు హీరోయిన్లు. ఈ క్రమంలో అక్కడ రాణించలేక మళ్లీ సౌత్ బాటపట్టిన హీరోయిన్లూ ఉన్నారు. అంతేకాదు రెండింటికీ దూరమై కెరియర్ ముగించిన వారూ లేకపోలేదు. కానీ తాప్సీ మాత్రం ఇందుకు మినహాయింపు. సౌత్‌ను పునాదిగా చేసుకుని ఎదిగిన భామ.. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్రతీ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూ.. ఆ తర్వాత దానికన్నా మెరుగైన కంటెంట్‌తో వస్తోంది. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్‌కు వెళ్లలేకపోతున్న తాప్సీ.. తాను చేసిన సినిమాల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా ‘బద్లా’ సినిమా సెట్‌లో తీసుకున్న ఫొటోను షేర్ చేసిన తాప్సీ.. ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటో అని తెలిపింది. ఆ రోజు నటి అమృతా సింగ్‌(సారా అలీఖాన్ తల్లి)తో ఫస్ట్ డే షూటింగ్‌లో పాల్గొన్నానని .. ఆమెను చూడటం, తనతో నటించడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పింది. కానీ దాదాపు 30 ఏళ్ల సినీ ప్రయాణం చేసిన అమృతా సింగ్.. కొత్తగా వచ్చిన నటి తన బెస్ట్ ఇచ్చేందుకు ఎంత ఉత్సాహంగా ఉంటుందో అలా ఉందని.. ఆ సన్నివేశాన్ని ఉత్తమంగా చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు చెప్పిన ప్రతీ మాటను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందని తెలిపింది. తన నటనలో చాలా డెప్త్ ఉందని.. అరుదైన నటుల్లో తనూ ఒకరని ప్రశంసించింది. తనతో ఫొటో తీసుకోవాలని ప్రయత్నించినా.. తను రిహార్సల్స్ చేయడంలో బిజీగా ఉండటం వల్ల ఇబ్బంది పెట్టలేదని తెలిపింది తాప్సీ.

https://www.instagram.com/p/CCvWHUeJn6l/?igshid=572z9w0455p4

Advertisement

Next Story