- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్టప్‌లతో సహకారానికి టీ-హబ్ ప్రత్యేక కార్యక్రమాలు!
దిశ, వెబ్‌డెస్క్: కార్పొరేట్ల నిర్దిష్ట అవసరాలను తీర్చేందుకు, కంపెనీల ఇన్నోవేషన్‌ను సమర్థవంతంగా పెంచేందుకు, స్టార్టప్‌లకు సహకారం అందించేందుకు రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్టు టీ-హబ్ ప్రకటించింది. కార్పొరేట్ సభ్యత్వం, టీ-లెక్స్ అనే రెండు కార్యక్రమాలు వివిధ పరిశ్రమలకు దేశీయంగానే కాకుండా ప్రపంచ సాంకేతిక పరిష్కారాలను అందించేందుకు కార్పొరేట్‌లను సన్నద్ధం చేయనుంది. ప్రముఖ గ్లోబల్ కార్పొరేట్ సంస్థలైన బోయింగ్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, నోవార్టిస్, హెచ్ఎస్‌బీసీ, శాంసంగ్, క్వాల్కమ్, ఏడబ్ల్యూఎస్ తదితర సంస్థలు ఇప్పటికే టీ-హబ్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. 2000కు పైగా అంతర్జాతీయ, జాతీయ స్టార్టప్‌లు, 500కు పైగా సలహాదారులు, 500 పైగా కార్పొరేట్‌లు, 20కి పైగా యూనివర్శిటీలకు అనుసంధనం కాబడి భారత్‌లో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్నోవేషన్ క్యాంపస్ ద్వారా కార్పొరేట్‌లు అవకాశాలను పొందవచ్చని టీ-హబ్ తెలిపింది. ‘ఐదేళ్లలో టీ-హబ్ అనేక కార్పొరేట్‌ల ప్రయాణానికి, పునఃరూపకల్పనకు వీలు కల్పించింది. అంతేకాకుండా పోటీతత్వాన్ని అలవర్చుకునేందుకు, కరోనా ముందునాటి స్థాయికి చేరుకునేందుకు సహాయపడిందని’ టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ చెప్పారు.