- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బేబీకి పేరు పెడితే.. పద్దెనిమిదేళ్లు ఫ్రీ వైఫై!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత టెక్ యుగంలో.. ఇంకాస్త క్లియర్‌గా చెప్పాలంటే కరోనా కాలంలో.. ఇంటర్నెట్ లేకుండా పని ఊహించలేకపోతున్నాం. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, విద్యార్థులు ఏవైనా కోర్సులు నేర్చుకోవాలన్నా, యువత ఇంటర్నషిప్ చేయాలన్నా, ఉద్యోగులు ఆఫీస్ వర్క్ చేయాలన్నా, ఆఖరికి షాపింగ్ చేయాలన్నా సరే.. ఇంటర్నెట్ కావాల్సిందే. మరి ఇన్ని పనులకు సెల్‌ఫోన్ డేటా ఏం సరిపోతుంది? తప్పనిసరిగా వైఫై కావాల్సిందే. ఈ విషయాన్ని పక్కనబెడితే ఫ్రీ వైఫై కోసం ఓ జంట తమ గారాలపట్టికి ఏకంగా వైఫై ప్రొవైడర్ పేరు పెట్టారు. ఇదేంటి పేరు పెట్టినంత మాత్రాన ఫ్రీ వైఫై ఇస్తారా? అనే కదా మీ డౌట్. అయితే మీరే తెలుసుకోండి.
స్విట్జర్లాండ్‌లోని ‘ట్విఫై’ అనే ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీ ఇటీవలే ఓ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. ‘మీ కుమార్తెకు గానీ, కుమారుడికి గానీ మా కంపెనీ పేరు కలిసి వచ్చేలా ‘ట్విఫియా’ లేదా ‘ట్విఫస్’ అని పేరు పెడితే 18 ఏళ్లపాటు ఉచిత వై-ఫై కనెక్షన్ అందిస్తాం. ఇందుకోసం మీరు మీ అమ్మాయి/అబ్బాయి సివిల్ బర్త్ సర్టిఫికెట్ ఫొటో అప్‌లోడ్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పద్దెనిమిదేళ్ల పాటు ఉచిత వై-ఫై కనెక్షన్ అందిస్తాం’ అని ఆ స్టార్టప్ కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రకటనను చూసిన ఓ స్విస్ జంట.. తమ కుమార్తెకు ‘ట్విఫియా’ అని పేరు పెట్టారు. దీంతో వారికి ఉచిత వై-ఫై కనెక్షన్ లభించింది. అయితే, వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ‘ఉచిత వై-ఫై ద్వారా ఆదా అయ్యే సొమ్మును కుమార్తె పేరుపై బ్యాంకులో వేస్తాం. ఆమె పెరిగి పెద్దయ్యాక సేవింగ్ చేసిన డబ్బుతో ఆమె కారు కొనుక్కోవచ్చు లేదా తనకు ఇష్టమైన వాటి కోసం ఉపయోగించుకోవచ్చు’ అని ఆ స్విస్ జంట తెలిపింది. ఈ ఆఫర్ ఇంకా అందుబాటులోనే ఉందని.. ట్విఫై వ్యవస్థాపకుడు, సీఈవో ఫిలిప్ ఫోష్ తెలిపారు.