- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిజిటల్ వాలెట్‌ను లాంచ్ చేసిన స్విగ్గీ
దిశ, వెబ్‌డెస్క్ : ఫేమస్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. తన కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలవాలంటే.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో న్యూ కస్టమర్లను ఆకట్టుకోవాలంటే.. మరిన్ని హంగులు కావాలి. ఆ నేపథ్యంలోనే.. లాక్‌డౌన్ వేళలో స్విగ్గీ గ్రోసరీ సేవలను కూడా ప్రారంభించింది. లేటెస్ట్‌గా ‘స్విగ్గీ మనీ’ పేరిట ఓ డిజిటల్ వాలెట్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామిగా చేరింది. అంతేకాదు లాంచింగ్ సందర్భంగా స్విగ్గీ మనీలో డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.
ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం.. ఇలా ఇప్పటికే చాలా డిజిటల్ వ్యాలెట్లు ఉన్నాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లలో మనం ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఈ పేమెంట్స్ యాప్స్ ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. కానీ ఇకపై స్విగ్గీలో ఆ అవసరం కూడా లేకుండా.. తామే స్వయంగా డిజిటల్ వ్యాలెట్‌ను తీసుకొచ్చారు. దీంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్‌లో యూజర్లు ఇతర పేమెంట్ ఆప్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కేవలం సింగిల్ క్లిక్‌లోనే స్విగ్గీలో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. స్వి గ్గీ వాలెట్‌ను మనీ స్టోర్ చేసుకునేందుకు, రీఫండ్స్ పొందేందుకు, ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇన్‌స్టంట్‌గా ఆన్‌లైన్ పేమెంట్లు జరిపేందుకు వాడుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి డాక్యుమెంట్లు, వెరిఫికేషన్ అవసరం లేకుండానే నేరుగా స్విగ్గీ మనీ వాలెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇక నాన్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఆధార్, పాన్ వంటి ఏదో ఒక ఐడీ కార్డును ఉపయోగించి స్విగ్గీ వాలెట్‌ను వాడుకోవచ్చు. స్విగ్గీ మనీతో వినియోగదారులు ఇన్‌స్టంట్ రీఫండ్లను కూడా పొందవచ్చని స్విగ్గీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ అగర్వాల్ చెప్పారు. ఈ వాలెట్ పేమెంట్ ఫెయిల్యూర్స్‌ను తగ్గిస్తుందని తెలిపారు.