- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూట్యూబ్‌లో ‘దిల్ బెచారా’ రికార్డ్!
ఒక హీరో ఇంతలా దగ్గరవుతాడా? తెరపై కథానాయకుడు ఇంతలా మనసును ఆక్రమిస్తాడా? మన కుటుంబ సభ్యుడు అయిపోతాడా? తన మరణం ఇంతగా కలిచి వేస్తుందా? ఇతరుల కారణంగా డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త.. మరీ ఇంతలా ఆవేదనకు గురిచేస్తుందా? అంటే అవును ఇది నిజమే అని.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, తర్వాత నెలకొన్న పరిస్థితులు చెప్తున్నాయి. ఒక సీరియల్ నటుడిగా కెరియర్‌ను ప్రారంభించిన తను.. కష్టపడి సినిమాలు చేశాడు, స్టార్ రేంజ్ సంపాదించాడు. ఎంతో మంది అభిమానుల మనస్సు గెలిచాడు. కానీ నెపోటిజం అనే ఒక్క విషయం తన కెరియర్‌ను అణగదొక్కుతుందనే భావనతో డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకోవడం అభిమానులు ఆవేదనకు కారణమైంది. అయితే ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానం యూట్యూబ్‌లో లైక్‌ల వర్షం కురిపిస్తోంది. రికార్డులు క్రియేట్ చేస్తోంది.
సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ కానుంది. జులై 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ట్రైలర్.. సోమవారం విడుదలై రికార్డులు సృష్టించింది. హాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టి మరీ, నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ వంటి ట్రైలర్స్‌ను వెనక్కి నెట్టి యూట్యూబ్‌లో అధిక సంఖ్యలో లైక్స్ అందుకున్న సినిమా ట్రైలర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
దిల్ బెచారా 5 మిలియన్ లైక్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 3.6 మిలియన్, ఎండ్ గేమ్ పార్ట్ 1, 2 ట్రైలర్స్ 3.2 మిలియన్, హీరో విజయ్ బిగిల్ 2.3 మిలియన్ లైక్స్‌తో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.