- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంత్యక్రియలకు ముందుకు రాని కుటుంబం.. ఆ ఊరి సర్పంచ్ అన్నీ తానై..
దిశ, మహబూబూబాద్ : కరోనాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ ఊరి సర్పంచ్ అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో పాటు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే, కరోనా మరణం కావడంతో అంత్యక్రియలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో కడసారి చూపుకు కూడా కొవిడ్ మృతుడు నోచుకోలేదు.
వివారాల్లోకి వెళితే.. మహబూబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని సబ్‌స్టేషన్ తండా గ్రామానికి చెందిన జర్పుల లచ్చు (70) కరోనా సోకి కోలుకుంటున్న క్రమంలో గురువారం ఒక్కసారిగా పల్స్ రేటు పడిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి తరలిద్దామనుకునే లోపే తుది శ్వాస విడిచాడు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సబ్‌స్టేషన్ గ్రామ సర్పంచ్ గుగులోత్ వెంకన్న పీపీఈ కిట్ ధరించి లచ్చు అంత్యక్రియలు నిర్వహించారు.