- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నితిన్ గడ్కరీ గారూ.. కోర్టుకు రండి!
ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ అమలు, కాలుష్య సంబంధిత అంశాలపై విచారిస్తున్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దగ్గర వినూత్న ఆలోచనలున్నాయని, వాటిని తమతో పంచుకునేందుకు కోర్టుకు రావల్సిందిగా కోరింది. శిలాజ ఇంధనాలను వినియోగిస్తున్న వాహనాలతో వాయు కాలుష్యం ఏర్పడుతున్న నేపథ్యంలో వాటికి ఇ-వెహికల్స్ సరైన ప్రత్యామ్నాయమని స్వయంగా మంత్రి గడ్కరీనే చెప్పారని గుర్తుచేసింది. కాబట్టి, ఇ-వెహికల్స్, కాలుష్యానికి సంబంధించిన అంశాలపై మంత్రి సహాయకారిగా ఉంటే బాగుంటుందని వివరించింది. మంత్రిని కోర్టుకు పిలవడం రాజకీయమవుతుందేమోనని గవర్నమెంటు కౌన్సిల్ అభిప్రాయపడగానే.. ‘తాము మంత్రికి సమన్లు జారీ చేయడం లేదు. ఇదొక విజ్ఞప్తి మాత్రమే. చట్టసభ్యుడు కాబట్టి.. నిర్ణయాలు తీసుకునే అధికారమున్న గడ్కరీ వస్తే బాగుంటుంది. వస్తాడో రాడో కనుక్కోండి’ అని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నిటి అయోగ్ రూపొందించిన 2012 ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ అమలు, కాలుష్య సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం విచారిస్తున్నది. కేవలం బాణాసంచా, పంట పొలాల్లో గడ్డిని తగలబెడితేనే కాదు.. సంవత్సరం పొడువునా ఉండే వాహన ఉద్గారాల గురించీ చర్చించాలని కోర్టు వ్యాఖ్యానించింది.