- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోరిక తీరిస్తేనే ఉద్యోగం.. బయటపడ్డ సూపర్‌వైజర్ వేధింపులు
దిశ, రాయలసీమ: ఆమె కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికురాలిగా పనిచేస్తుంది. ఆమెపై సూపర్ వైజర్ కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు. ఆమె తిరస్కరించింది. కోరిక తీరిస్తేనే ఉద్యోగం ఉంటుందని లేకపోతే ఉద్యోగం ఉండదని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా తాకరానిచోట తాకుతూ వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు ఐద్వా సభ్యుల సహకారంతో బడితపూజ చేసింది. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లా తిరుచానూర్‌లో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుచానూర్‌కు చెందిన ఓ మహిళ రైల్వేశాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో కార్మికురాలిగా పని చేస్తుంది. ఆమెపై సూపర్‌వైజర్ గుణశేఖర్ కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ ఆ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించసాగాడు. ఉద్యోగం ఉండాలంటే తన కోరిక తీర్చమని గత కొన్నిరోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఐద్వా సభ్యులను సంప్రదించింది. వారి సహకారంతో గుణశేఖర్ చెప్పిన తిరుచానూర్‌లోని ఓ లాడ్జ్ వద్దకు వెళ్లింది. ఆమెను అనుసరించి వెళ్లిన ఐద్వా నాయకురాళ్లు గుణశేఖర్‌ను పట్టుకుని బడిత పూజ చేశారు.
ఇంకెప్పుడు తాను వేధించనని ఆమెకు క్షమాపణలు చెప్పించారు. నిందితుడు గుణశేఖర్ బాధితురాలు కాళ్లు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. అనంతరం తిరుచానూర్ పోలీసులకు అతడిని అప్పగించారు. గుణశేఖర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.