- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
48గంటల్లోనే మంచినీటి ట్యాంకర్ డెలివరీ
దిశ, హైదరాబాద్: నగరంలో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదనీ, బుక్ చేసుకున్న 48గంటల్లోనే మంచి నీటి ట్యాంకర్ వస్తుందని వాటర్ బోర్డు ఎండీ ఎం.దానకిషోర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 10మంది అధికారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్ వాటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వేసవి కార్యాచరణ సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.50 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటీకే బోర్డు పరిధిలో ఉన్న ట్యాంకర్లకు తోడు మరో 230 అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. అంతేకాకుండా, మరో 23 ఫిల్లింగ్ స్టేషన్లు, 110 ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంచినీటి సమస్యత్మాక ప్రాంతాల్లో లోప్రెషర్ పనులు, ఫిల్లింగ్ స్టేషన్లు పరిశీలించి ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించడానికి 100మందితో థర్డ్ పార్టీ తనిఖీలు చేపడతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటీకే లోప్రెషర్, టెయిల్ ఎండ్ ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పనిచేయని బోర్‌వెల్స్‌కు రిపేరు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వాటర్ బోర్డు డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, వి.ఎల్.ప్రవీణ్ కుమార్ సంబంధిత సీజీఎమ్‌లు, జీఎమ్‌లు పాల్గొన్నారు.