- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టాల్లో విండీస్ – బ్రాడ్ ఆల్‌రౌండ్ షో
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 369 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ జట్టును ఇంగ్లిష్ బౌలర్లు దెబ్బ తీశారు. ఓపెనర్ కెగ్ బ్రాత్‌వెయిట్ మరోసారి నిరాశ పరిచాడు. ఒకే పరుగుకు బ్రాడ్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్యాంప్‌బెల్ (32), షాయ్ హోప్ (17) ఆచితూచి ఆడారు. కొద్ది సేపటికి క్యాంప్‌బెల్ దూకుడుగా ఆడబోయి ఆర్చర్ బౌలింగ్‌లో బర్న్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత విండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. హోప్ (17), బ్రూక్స్ (4), చేజ్ (9) తక్కువ పరుగులకే అవుటవ్వడంతో విండీస్ 73 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న బ్లాక్ వుడ్ (26), జాసన్ హోల్డర్‌తో కలసి ఆరో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం అందించి పెవీలియన్ చేరాడు. కెప్టెన్ జేసన్ హోల్డర్ (24), డోరిచ్ (10) ఆచితూచి ఆడుతున్నారు. 47.1 ఓవర్ల వద్ద వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఆటను నిలిపేశారు. అప్పటికి విండీస్ స్కోర్ 137/6
బ్రాడ్ మెరుపు ఇన్నింగ్స్
నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి సెషన్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. జాన్ పోప్ (91), క్రిస్ వోక్స్ (1), కీపర్ జోస్ బట్లర్ (67), జోఫ్రా ఆర్చర్ (3) లు త్వరగానే వికెట్లను పారేసుకున్నారు. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేశాడు. మూడేళ్ల తర్వాత అతను చేసిన హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. బెస్ (18), అండర్సన్ (11) సాయంతో బ్రాడ్ పరుగుల వరద పారించాడు. చివరకు చేజ్ బౌలింగ్‌లో బ్రాడ్, హోల్డర్ బౌలింగ్‌లో అండర్సన్ అవుటవ్వడంతో ఇంగ్లండ్ 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కీమర్ రోచ్ రికార్డు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను కీమర్ రోచ్ కుప్పకూల్చాడు. నాలుగు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. అలాగే తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. 26ఏళ్ల వయసులోనే 200 టెస్టు వికెట్లు తీసిన విండీస్ బౌలర్‌గా రికార్డు పుటలకు ఎక్కాడు. తొలిసారి ఈ ఫీట్ గ్యారీ సోబర్స్ సాధించాడు. రోచ్ 59 టెస్టుల్లో 200 వికెట్లు తీయగా, సోబర్స్ 80 టెస్టుల్లో ఈ మైలురాయి అధిగమించాడు.
స్కోర్ బోర్డు
తొలి ఇన్నింగ్స్
ఇంగ్లండ్ బ్యాటింగ్: రోరీ బర్న్స్ 57, సిబ్లే 0, జో రూట్ 17, బెన్ స్టోక్స్ 20, జాన్ పోప్ 91, జాస్ బట్లర్ 67, క్రిస్ వోక్స్ 1, డామ్ బెస్ 18 నాటౌట్, జోఫ్రా ఆర్చర్ 3, స్టువర్ట్ బ్రాడ్ 62, జేమ్స్ అండర్సన్ 11. మొత్తం 369 (ఎక్స్‌ట్రాలు 22)(111.5 ఓవర్లు)
వెస్టిండీస్ బౌలింగ్: కీమర్ రోచ్ (25.4-72-4), గాబ్రియేల్ (23.2-5-77-2), జాసన్ హోల్డర్ (24.5-5-83-1), కార్న్‌వాల్ (27-5-85-0), చేజ్ (11-3-36-2)
వెస్టిండీస్ బ్యాటింగ్: క్రెగ్ బ్రాత్‌వెయిట్ 1, జాన్ క్యాంప్‌బెల్ 32, షాయ్ హోప్ 17, బ్రూక్స్ 4, చేజ్ 9, బ్లాక్‌వుడ్ 26, జేసన్ హోల్డర్ 24 బ్యాటింగ్, డోరిచ్ 10 బ్యాటింగ్. మొత్తం 137/6 (ఎక్స్‌ట్రాలు 14) (47.1 ఓవర్లు)
ఇంగ్లండ్ బౌలింగ్: జేమ్స్ అండర్సన్ (11-4-17-2), స్టువర్ట్ బ్రాడ్ (10-3-17-2), ఆర్చర్ (13.1-1-55-1), వోక్స్ (13-1-39-1)