మున్సిపల్ కార్మికుల ఆత్మహత్యాయత్నం..!

by Sumithra |
మున్సిపల్ కార్మికుల ఆత్మహత్యాయత్నం..!
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం విధుల్లోకి వచ్చిన నలుగురు కార్మికులు వాటర్ వర్క్స్ విభాగం వద్ద ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ కౌన్సిలర్ వచ్చి ఎఫ్‎బీవో శ్యామ్‎ను వాటర్ వర్క్స్ విభాగంలోకి తీసుకువస్తామని చెప్పడంతో పాటు ఇష్టం ఉంటే పని చేయండి లేకపోతే లేదని బెదిరించారని కార్మికులు ఆరోపించారు. కౌన్సిలర్ తీరుకు మనస్తాపం చెంది వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశామని కార్మికులు తెలిపారు. మరోవైపు ఇటీవల కామారెడ్డి మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తోటి కార్మికులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చైర్మన్, కమిషనర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కిందకు దిగేది లేదంటున్న భీష్మించుకుని కూర్చున్నారు.

Advertisement

Next Story