కోవాక్సిన్ టీకా ప్రయోగాల్లో సత్ఫలితాలు

by Shamantha N |
కోవాక్సిన్ టీకా ప్రయోగాల్లో సత్ఫలితాలు
X

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ టీకా జంతువులపై ప్రయోగాల్లో సత్ఫలితాలనిచ్చింది. తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్‌ను నియంత్రించే నిరోధక శక్తిని ప్రేరేపించిందని ఫార్మా సంస్థ వెల్లడించింది. టీకా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నదని జంతువులపై ప్రయోగాలు నిరూపించాయని తెలిపింది. వానర జాతికి చెందిన 20 రేసస్ మెకాక్స్‌లపై ఈ టీకాను ప్రయోగించినట్టు ఓ ప్రకటనలో సంస్థ పేర్కొంది.

వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపులోని కోతులకు కేవలం ప్లేస్‌బో ఇచ్చి, మిగతా వాటికి 14 రోజుల వరకు మూడు వేర్వేరు వ్యాక్సిన్‌ క్యాండిడేట్లు ఇచ్చినట్టు వివరించింది. 14 రోజుల తర్వాత రెండో డోసు ఇచ్చినట్టు తెలిపింది. ఈ ప్రయోగాల్లో మూడో వారం నుంచి వైరస్‌ను నిలువరించే యాంటీబాడీలు అనూహ్యంగా పెరిగినట్టు గుర్తించామని వివరించింది.

ప్లేస్‌బో మినహా వ్యాక్సిన్ ఇచ్చిన గ్రూపుల్లోని జంతువుల్లో న్యూమోనియా లక్షణాలు కనిపించలేవని పేర్కొంది. మొత్తంగా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో కొవిడ్ 19 సోకినప్పటికీ దాన్ని నిలువరించే నిరోధక శక్తిని కోవాక్సిన్ టీకా కలుగజేసినట్టు నిరూపితమైందని సంస్థ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed