బెల్ట్ ‌షా‌పులను నియంత్రించండి.. వినతిపత్రం అందజేత

by Sridhar Babu |   ( Updated:2021-12-08 02:04:03.0  )
బెల్ట్ ‌షా‌పులను నియంత్రించండి.. వినతిపత్రం అందజేత
X

దిశ, నేలకొండపల్లి : మండల కేంద్రంలో ఉన్న బెల్టుషాపులను నియంత్రించాలని నేలకొండపల్లి గ్రామ వార్డు మెంబర్లు, నాయకులు బుధవారం నేలకొండపల్లి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయందర్‌కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బెల్ట్ ‌ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, రోడ్ల పక్కన నివాసముండే గృహాల పక్కన బెల్ట్ ‌షాపుల విక్రయాలు, అడ్డగోలు వ్యాపారాలు జరుగుతున్నాయి. దీని వల్ల మహిళలు బయటకు వెళ్లే పరిస్థితి లేదని వాపోయారు. అలాగే 21 సంవత్సరాల వయసులోబడిన వారికి చట్టరీత్యా మద్యం విక్రయించ కూడదు. కానీ, అందుకు భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో జోరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. గవర్నమెంట్ వారి లెక్కల పరంగా మండల పరిధి, మండల కేంద్రంలో మూడు స్వచ్ఛంద వైన్ షాపులు వచ్చాయి కాబట్టి ఆ షాపులోనే విక్రయాలు జరగాలని కోరారు. కొత్త వేరియెంట్, కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ బెల్ట్ షాపులను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి పట్టణ అధ్యక్షుడు వంగవీటి నాగేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు గొలుసు రవి,మేజర్ గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు కందరబోయిన భాను, కనకప్రసాద్, బాజా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story