- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ హిస్టరీ(బెంగాల్ ఆక్రమణ 1764 - గ్రూప్స్ స్పెషల్)
బెంగాల్ రాజ్యాన్ని స్థాపించింది ముర్షీద్ కూలీఖాన్.
ఇతని తర్వాత నవాబులు ఘజావుద్దీన్, సర్పరాజ్‌ఖాన్, ఆలీవర్దిఖాన్.
1756లో ఆలీవర్ధిఖాన్ మరణించడంతో అతని మనుమడు సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు.
ఈ సమయంలో దక్షిణ భారతదేశంలో బ్రిటీష్, ఫ్రెంచివారి మధ్య 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఆరంభమైంది.
బెంగాల్‌లో బ్రిటీష్, ఫ్రెంచ్ వారు తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
సిరాజ్ ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపివేయవలసినదిగా ఆజ్ఞలను జారీ చేశాడు.
చంద్రనాగోర్‌లో ఉన్న ఫ్రెంచి దీనిని అంగీకరించగా బ్రిటీష్‌వారు తిరస్కరించారు.
సిరాజ్ ఖాసిం బజార్‌పై దాడి చేసి బ్రిటీషు స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 150 మందిని ఒక చీకటి గదిలో బంధించాడు.
ఈ దాడి సమయంలో కొంతమంది ఆంగ్లేయులు (వారెన్ హేస్టింగ్, కలకత్తా గవర్నర్‌తో సహా) ఫాల్టా దీవులకు పారిపోయారు.
ఈ విషయం మద్రాసులో ఉన్న రాబర్ట్‌క్లైవ్‌కు తెలిసింది.
రాబర్ట్‌క్లైవ్, అడ్మిరల్ వాట్సన్ ముందుగా ఫాల్బా దీవికి చేరుకొని అక్కడి ఆంగ్లేయులను రక్షించారు.
తర్వాత చీకటి గది యొక్క తలుపులను తెరిచారు.
150 మందిలో కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. దీనినే చీకటి గది ఉందంతం అంటారు.
21 మందిలో ఒకడైన హోల్‌వెల్ చీకటి గది ఉదంతమును రాబర్ట్ క్లైవ్‌కు వివరించాడు.
రాబర్ట్ క్లైవ్ కలకత్తా, హుగ్రీలను ఆక్రమించడంతో సిరాజ్ ఆలీనగర్ అనే ఒప్పందమును కుదుర్చుకొని బ్రిటీష్ వారికి పూర్వపు హోదాను కల్పించాడు.
కానీ రాబర్ట్‌క్షైవ్ కుట్రల ద్వారా బెంగాల్‌ను ఆక్రమించాలని నిర్ణయించుకున్నాడు.
కుట్రదారులు వీరే:
మీర్‌జాఫర్ - సిరాజ్ యొక్క సైన్యాధ్యక్షుడు (మీర్‌బక్షి)
మిరాన్ - మీర్‌జాఫర్ కుమారుడు
అమీన్‌చంద్ - వ్యాపారి, మధ్యవర్తి
మాణిక్‌చంద్ - కలకత్తా ఇన్‌చార్జి
జగత్ సేఠ్ - బెంగాల్‌లో అత్యంత ధనికుడు
రాయ్‌దుర్లభ్, ఖాదిమ్‌ఖాన్- సిరాజ్ యొక్క సైనికాధికారులు
ప్లాసీ యుద్ధం:
1757 జూన్ 2న ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌క్లైవ్ సిరాజ్ ఉద్దౌలాను ఓడించాడు.
మీర్ మదన్, మోహన్‌లాల్ అనే సిరాజ్ సైనికులు సిరాజ్ తరపున వీరోచితంగా పోరాడి మరణించారు.
మిరాన్ పారిపోతున్న సిరాజ్‌ను పట్టుకొని ఉరితీసాడు.
భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం - ప్లాసీ యుద్ధం
బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్:
1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. 3 కోట్ల రూపాయలను, 24 పరగణాల జమిందారీ హక్కులను బ్రిటీష్‌కు ఇచ్చాడు.
1760 నాటికి బెంగాల్ ఖజానా ఖాళీ అవుటచే మీర్ జాఫర్ బహుమానాలు ఇచ్చుటకు నిరాకరించాడు.
దీంతో మీర్‌జాఫర్‌ను తొలగించి అతని అల్లుడైన మీర్ ఖాసీంను బెంగాల్ నవాబును చేశారు.
దీనికిగాను మీర్‌ఖాసిం 3 ప్రాంతాలను బ్రిటీష్‌కు ఇచ్చాడు. అవి
1. మిద్నాపూర్.
2. చిట్టగాంగ్
3. బుర్దామాన్
బెంగాల్ నవాబుగా మీర్ ఖాసిం:
మీర్ ఖాసిం సమర్దుడైన పాలకుడు. బ్రిటీష్ జోక్యం వరిపాలనలో ఉండకూడదని తన రాజధానిని ముర్షీదాబాద్ నుండి మొంఘీర్‌కు మార్చాడు.
బెంగాల్ వర్తకులు ఎవ్వరునూ సుంకములు చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించుట కారణంగా మీర్‌ఖాసీం మరియు బ్రిటీష్ వారిమధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
చిన్న చిన్న యుద్దాలలో మీర్ ఖాసీం ఓటమిపాలై అవధ్‌కు పారిపోయాడు.
రెండోసారి నవాబుగా మీర్ జాఫర్:
1763లో మీర్ జాఫర్ మరలా బెంగాల్ నవాబుగా నియమించబడ్డాడు.
మీర్‌ఖాసీం అవధ్ పాలకుడు అయిన ఘజా ఉద్దౌలాతో, మొగల్ చక్రవర్తి అయిన 2వ షాఆలంతో బ్రిటీషుకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేశాడు.
1764లో బ్రిటీష్ జనరల్ మన్రో ఈ కూటమిని బక్సర్ యుద్ధంలో ఓడించాడు.
దీంతో బెంగాల్ (పశ్చిమ బెంగాల్, బీహార్, బంగ్లాదేశ్, ఒరిస్సా) పూర్తిగా బ్రిటీష్ ఆధీనంలోకి వచ్చింది.
1765లో అలహాబాద్ ఒప్పందం తర్వాత రాబర్ట్‌క్లైవ్ బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు.
ఇవి కూడా చదవండి:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 238 లోకో పైలట్ ఉద్యోగాలు