తెలంగాణ చరిత్ర: ముల్కీ లీగ్ ఏర్పాటు-1935: (గ్రూప్ -2 స్పెషల్ )

by Harish |
తెలంగాణ చరిత్ర: ముల్కీ లీగ్ ఏర్పాటు-1935: (గ్రూప్ -2 స్పెషల్ )
X

ముల్కీల హక్కులు కాపాడుటకు, పౌరసత్వపు హక్కులు సంపాదించుటకు, రాజకీయ సంస్కరణలు సాధించడానికి, ఒక ప్రజా సంస్థ అవసరమని భావించి నిజాం ప్రజల సంఘం అనే సంస్థను స్థాపించారు.

నిజాం ప్రజల సంఘం స్థాపించబడిన సంవత్సరం 1934

దీనినే ఉర్దూలో జమీమత్ రిపాయా మే నిజాం అంటారు.

ఈ సంస్థనే 1935 నాటికి నిజాం ముల్కీలీగ్‌గా రూపాంతరం చెందింది.

ముల్కీ లీగ్ అధ్యక్షులు నవాబ్ సర్ నిజాముత్ జంగ్.

ఇతను నిజాం మంత్రి మండలిలో రాజకీయ శాఖ మంత్రిగా పనిచేసి 1930లో పదవి నుంచి తప్పుకున్నాడు.

ఉపాధ్యక్షులు 1. డా. లతీఫ్ సయిద్ 2. రామచంద్రనాయక్

కార్యదర్శలు 1. సయిద్ అబిద్ హసన్ 2. బూర్గుల రామకృష్ణారావు 3. శ్రీనివాసరావు శర్మ.

కోశాధికారి బారిష్టర్ నౌషిర్ చినామ్.

ఈ సంస్థ 18 సభ్యులతో తన కార్యదర్శి ఏర్పాటు చేశారు.

పత్రికలు :

మందమూల నర్సింగరావు స్థాపించిన పత్రిక రమ్యత్ పత్రిక

అహ్మద్ మొహద్దీన్ రహబత్ ఇ దక్కన్ పత్రిక

మీర్ హసనుద్దిన్ మమ్లకత్ పత్రిక.

ఈ సంస్థ ఉద్దేశాలు:

దక్కనీ సంస్కృతి, భాషా పరిరక్షణే తమ ఉద్యమం అని ప్రకటించింది.

నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తొలగించి వారి స్థానంలో ముల్కీలను నియమించి, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమించింది.

బ్రిటిష్ వారి ఒత్తిడిని, సలహాలను నిజాం పక్కన బెట్టాలని, తమ పాలనకు పూర్వ వైభవం తేవాలని ముల్కీ లీగ్ ప్రచారం చేసింది.

బ్రిటీష్ వారిని, నాన్ ముల్కీలను ముల్కీ లీగ్ ప్రత్యర్థులుగా భావించింది.

నిజాం సార్వభౌమాదిపత్యం, రాజ్యాంగబద్దమైన పరిపాలన, సంస్థానంలో పూర్వం అమల్లో ఉన్న జాగీర్ధార్లు, దేశ్‌ముఖ్‌ల వ్యవస్థ తిరిగి ఏర్పాడాలని ముల్కీలీగ్ అభిప్రాయం.

నిరుద్యోగ సమస్య: ఉత్తర భారతదేశ నాన్‌ముల్కీల ఆధిపత్యధోరణి వల్లే ముల్కీ ఉద్యమం ప్రారంభమైందని ముల్కీ లీగ్ స్పష్టం చేసింది.

దక్కనీ జాతీయతను ముల్కీ లీగ్ ప్రచారం చేసింది.

హైదరాబాద్ సంస్థానపు కామన్ లాంగ్వేజ్‌గా హిందుస్థానీని (హిందీ) ప్రోత్సహించాలని తెలిపింది.

అంతానికి కారణాలు :

1937లో ముల్కీలీగ్‌లో చీలిక వచ్చి దాని నుండి బయటికి వచ్చిన హిందువులు ప్రారంభించిన సంస్థ పీపుల్స్ కన్వెన్షన్

హరిపుర (గుజరాత్)లో 1938 లో జరిగిన కాంగ్రెస్ జాతీయ సభలకు సంస్థానం నుండి 500 మంది యువకులు వెళ్లి వచ్చి స్టేట్ కాంగ్రెస్ స్థాపించారు.

ముల్కీలీగ్‌ను నడిపిన కొందరు ముఖ్యనాయకులు కాంగ్రెస్ స్థాపించడంలో ప్రధాన పాత్ర వహించారు.

ముల్కీ లీగ్ కొనసాగింపే 1938లో ప్రారంభించబడిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. కొంత మంది ముస్లింలు ఎంఐఎం లో చేరారు.

ఈ పరిణామాలతో 1939లో ముల్కీ లీగ్ అంతమైంది.

ముల్కీ లీగ్ కార్యదర్శి వర్గం ఏర్పాటు:

నిజాం ముల్కీ లీగ్ కార్యదర్శి వర్గంలో మొత్తం 18 మంది సభ్యులున్నారు.

1. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి

2. అక్బర్ అలీ ఖాన్

3. అబుల్ హసన్ సయ్యద్ అలీ

4. శంకర్‌రావు బోర్గీంకర్

5. ఖలీలుజ్జామా

6. శ్రీపతిరావు

7. నవాబ్ షంషేర్ జంగ్

8. కాశీనాథ్ రావు వైద్య

9. గోపాలరావు వకీలు

10. జనార్ధన్‌రావు దేశాలు

11. మందముల నర్సింగరావు

12. నవాబ్ మెయిన్ మార్‌జంగ్

13. వామన్ నాయక్

14. మాడపాటి హనుమంతరావు.

15. వివి జోషి

16. అహమ్మద్ మొహద్దిన్

17. మీర్‌హసనోద్దిన్

18. నవాబ్ బహదూర్‌మార్ జంగ్

- వెంకటరాజం బొడ్డుపల్లి, సీనియర్ ఫ్యాకల్టీ.

Advertisement

Next Story

Most Viewed