- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదువు కోసం కాలువ దాటాల్సిందే.. విద్యార్థుల అవస్థలు పట్టించుకోరా?
దిశ, అచ్చంపేట: మొన్నటి దాక కోవిడ్ కష్టకాలంతో విద్యార్థులు విద్యకు దూరంగా ఉన్న దుస్థితి. నేడు పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ఉరుకులు, పరుగులు పెడుతున్న సందర్భం.
ప్రకృతి కన్నెర్ర చేస్తే….
సృష్టిలో ప్రకృతి మానవ మనుగడకు ప్రధాన భూమిక పోషిస్తుంది. కానీ అదే ప్రకృతి ఏ రూపంలోనైనా కన్నెర్ర చేసినప్పుడు సమాజం ఒక ప్రాంతంలో ఒక విధంగా విలవిలలాడుతూ అవస్థలు పడతారు. కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి విశ్వరూపం చూపుతున్న ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులకు విద్య శాపంగా మారుతుందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో గల ఉప్పునుంతల, వంగూరు మండలాల మధ్య కృష్ణానదికి ఉపనది అయిన దుందుభి కాలువ ఎప్పుడూ ఉరకలు వేసినా కూడా పై రెండు మండలాల ప్రజలు, విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
చదువుల కోసం విద్యార్థులు అవస్థలు...
వంగూరు, ఉప్పునుంతల మండలాల పరిధిలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పై రెండు మండలాల్లో దుందుభి వాగు ప్రవహిస్తుంది. ఈ నది ఎప్పుడూ ఉధృతంగా ప్రవేశించినా రెండు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గత కొంతకాలంగా దుందుభి వాగు పారుతుండడంతో అచ్చంపేట, కల్వకుర్తి డిపోలకు చెందిన బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. అచ్చంపేట డిపోకు చెందిన బస్సు మొల్గర గ్రామం వరకే వచ్చి వెళుతుండటంతో వంగూరు మండలం ఉల్పర గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రమాదభరితంగా ఉన్న కాజ్వేపై నడుచుకుంటూ అవస్థలు పడుతూ అతి కష్టం మీద మొల్గర గ్రామానికి చేరుకుంటున్నారు. ఇక్కడ నుండి ఆర్టీసీ బస్సులు ఆశ్రయించి అచ్చంపేటకు చేరుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు మండలాల ప్రజలు, విద్యార్థులు రాకపోకలు ప్రశాంతంగా కొనసాగాలంటే అందుకు ఉప్పునుంతల, వంగూరు మండలం మధ్యన గల దుందుభి వాగు కాజ్వేపై వంతెన నిర్మాణం చేపట్టడమే శాశ్వత పరిష్కారం. అందుకు ప్రజాప్రతినిధులు వంతెన నిర్మాణం చేపట్టి రెండు మండలాల ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, పరిష్కారం చూపేందుకు చొరవ చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.