- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్క్‌ల మెమో చూసి షాకైన విద్యార్థులు.. ఎందుకంటే ?
దిశ అశ్వారావుపేట : విద్యార్థుల మార్కుల మెమోలో విద్యార్థులకురాని మార్కులు నమోదవడంతో విద్యార్థులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఐటిఐ కళాశాలలో ఎలక్ట్రిషన్ ట్రేడ్ చదువుతున్న విద్యార్థులు ఆ కాలేజీలో పరీక్షలు పూర్తయిన తర్వాత ఎన్నో రోజులు మార్కుల మెమో కోసం వేచి ఉన్నారు. ఈ తరుణంలో విద్యార్థులు యాజమాన్యంపై తమ మార్కుల మెమోల గురించి తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. అప్పుడు యాజ మాన్యం త్వరలో మెమోలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఇచ్చిన మెమోల్లో విద్యార్థులకు రావాల్సిన మార్కులు కంటే మరో 40 శాతం అధికంగా వచ్చాయి. అంటే ఉదాహరణకు పరీక్ష 50 మార్కులకు అయితే విద్యార్థులకు 70 మార్కులు వచ్చాయి దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ కళాశాలలో చదువుతున్న ఎలక్ట్రిషన్ విద్యార్థులు మొత్తానికి కూడా అదే రీతిలో మార్కులు రావడంతో ఆ మెమోలు విద్యార్థులకు పనికిరాకుండా పోయాయి. దీంతో వెంటనే విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకొని కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను మార్కులు మెమోలో తప్పుగా నమోదయ్యాయని చెప్పడంతో సరి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే ఒక మెమోని ఎన్నిసార్లయినా సరి చేసి ఇవ్వోచా… అంటే విద్యార్థుల బతుకుల మీద ఆటలుఆడుకుంటున్నారా అని మండిపడ్డారు. టెక్నికల్ కోర్సులు చేసి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకున్న విద్యార్థులు ఆశలను కళాశాల యాజమాన్యం అవిరి చేసింది. కాలేజీ యాజమాన్యం మాత్రం మెమోలను సరిచేసి మళ్లీ తిరిగి ఇస్తాం అనటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.