- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేయూ వీసీకి చేదు అనుభవం.. మీడియా ఏదుటే విద్యార్థులు..
దిశ,కాళోజీ జంక్షన్ : కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్‌కు విద్యార్థి సంఘాల నాయకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. బీఎడ్ విద్యా విధానంలో తాజాగా వచ్చిన మార్పులను ఉద్దేశించి వివరించేందుకు సోమవారం వీసీ రమేష్ అధ్యక్షతన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు పలు సమస్యలపై వీసీని నిలదీశారు. కేయూలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. పీహెచ్‌డీ రిజల్ట్స్‌తో పాటు ఎంఫిల్‌కు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని, కేయూను నాశనం చేసే కుట్ర జరుగుతోందని వీసీ ఎదుటే విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. పొడియం ఎదుటే చాలాసేపు బైఠాయించి వీసీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుందని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.