వాగులో పడి విద్యార్థి మృతి

by Sridhar Babu |
వాగులో పడి విద్యార్థి మృతి
X

దిశ, మానకొండూరు: మానకొండూరులో విషాదం నెలకొంది. వాగులో పడి విద్యార్థి మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల అజయ్ పెద్దనాన్న చనిపోయి తొమ్మిది కావడంతో కుటుంబంతో కలిసి శనివారం మానేరు వాగులో స్నానానికి వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేస్తున్న అజయ్ ప్రమాదవశాత్తు, వాగులోని లోతైన గుంటలో మునిగి ఈత రాక చనిపోయాడు.

Advertisement

Next Story