- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోన్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు..!
by Shyam |
X
దిశ, పటాన్‌చెరు: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాలువలు, నాలాలు, బఫర్ జోన్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. పటాన్‌చెరు క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా నీటి పారుదల శాఖ, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీసు శాఖల అధికారులతో మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి సీతారామపురం కాలనీలో కాలువలను పరిశీలించారు.
సీతారామయ్య కాలనీలో లేవుట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కాలువలను పూర్తి కబ్జా చేసి రోడ్డును ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలువలు నాళాల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Advertisement
Next Story