- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూతూ మంత్రంగా ఎంక్వైరీ.. ఇలా వచ్చి అలా వెనుదిరిగిన యంత్రాంగం..
దిశ, హైదరాబాద్ : జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన నిర్మాణం పై ‘భారీ అక్రమ నిర్మాణం’ పేరుతో గురువారం దిశ దినపత్రికలో ప్రచురితమైంది. ఈ కథనంపై చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన నిర్మాణం జరుగుతున్న షెడ్ దగ్గరకు డిమాలిషన్ సిబ్బందితో సహా వెళ్లారు. కానీ ఇంతలో ఏం జరిగిందో కానీ షెడ్ వద్ద పచార్లు కొట్టిన సిబ్బంది, ఫోన్‌లో మాట్లాడారు. అక్కడికి ఎంత స్పీడ్ గా వచ్చారో అంతే స్పీడ్‌గా వెనుదిరిగి వెళ్లి పోయారు. అందరూ ఊహించినట్టుగానే అక్కడి నుండి జారుకున్నారు.
ఈ వ్యవహారాలు చూడాల్సిన నోడల్ ఆఫీసర్‌ను ఈ మధ్యనే ఆ సీట్లో నుంచి తొలిగించారని, అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకుంటాం, ఎన్ఫోర్స్మెంట్ వాళ్లను పంపిస్తున్నామని చెప్పిన డీసీ ఇప్పుడు నాకేం తెలియదంటున్నాడు. అంతా నోడల్ ఆఫీసర్ చూసుకుంటారని చెప్పి జారుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.