- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బర్డ్ ఫ్లూ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేరళ సహా పలు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఫౌల్ట్రీ దిగుమతులను నిషేధించాయి. ఈక్రమంలోనే 10రోజుల పాటు ఫౌల్ట్రీ దిగుమతులు నిలిపివేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేయగా.. అటు కర్ణాటక ప్రభుత్వం సైతం కేరళ నుంచి కోళ్ల దిగుమతులను ఆపేసినట్లు తెలిపింది. బర్డ్ ఫ్లూ కారణంగా నష్టపోతున్న ఫౌల్ట్రీ రైతులకు పరిహారం అందిస్తామని కేరళ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తూ వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు, బాతులు చనిపోతుండటంతో అలర్టైన కేంద్ర ప్రభుత్వం.. బర్డ్ ఫ్లూపై సమీక్షించేందుకు కేరళ, హర్యానా రాష్ట్రాలకు బృందాలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై పర్యవేక్షణకు ఢిల్లీలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.