- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏయే రాష్ట్రాల్లో ‘పది’ రద్దు.. ఇంటర్ పరీక్షలు వాయిదా..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఒక్కసారిగా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం నివేదికల మేరకు పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులకు సరిపడా ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో లేవు. దీనికితోడు వ్యాక్సిన్ కొరత కూడా ఇబ్బంది పెడుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించగా, మరికొన్ని స్టేట్స్ నైట్ కర్ఫ్యూ విధించాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా విద్యార్థులు చాలా మంది కరోనా బారిన పడుతూ వచ్చారు. ఎగ్జామ్స్ సమయం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చే క్రమంలో వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారు. దీనిపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గురువారం CBSC(పదవ) తరగతి పరీక్షలు రద్దు చేయడంతో పాటు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ సీబీఎస్‌ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇవాళే తెలంగాణ ప్రభుత్వం కూడా టెన్త్‌తో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలకు జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇదే విధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పది, ఇంటర్ ఎగ్జామ్స్‌ను పోస్టు పోన్ చేశాయి. అయితే, హర్యానా, తెలంగాణ, తమిళనాడు, ఏపీ లాంటి రాష్ట్రాలు పదో తరగతి బోర్డు పరీక్షలను మొత్తానికే రద్దు చేసి, విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.