శ్రీశైలం ఆలయం మూసివేత

by Anukaran |   ( Updated:2020-07-14 10:05:11.0  )
శ్రీశైలం ఆలయం మూసివేత
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవాలయం వారం రోజుల పాటు మూతబడనుంది. తాజాగా ఆలయానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురితో పాటు ఇద్దరు పరిచారికలు కరోనా బారిన పడ్డారు. దీంతో రేపటి నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఈవో ప్రకటించారు. వారం రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనాలు ఉండవని, స్వామివారికి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఈవో తెలిపారు.

Advertisement

Next Story