- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పుత్నిక్ వీ డోసు ధర ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా డోసు రూ. 750 ఉంటుందని, మే-జూన్‌లలో మనదేశంలో అందుబాటులోకి వస్తాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వెల్లడించింది. జూన్‌కల్లా లక్షల్లో డోసులు అందుబాటులో ఉండొచ్చని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. తొలుత రష్యా నుంచి టీకాలు దిగుమతి అవుతాయని, ఇవన్నీ ప్రైవేటు మార్కెట్‌కే విక్రయిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వమూ ఇటీవలి ప్రకటనలో వినియోగానికి సిద్ధంగా ఉన్న దిగుమతి చేసుకున్న విదేశీ టీకాలను మొత్తంగా ప్రైవేటురంగానికి విక్రయించే అవకాశాన్ని కల్పించింది. తమ పార్ట్‌నర్ ప్రపంచవ్యాప్తంగా ఒకే ధరతో డోసులు అమ్మాలని భావిస్తున్నారని జీవీ ప్రసాద్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో విధించిన పరిమితికి లోబడి పది డాలర్లు(దాదాపు రూ. 750)కు ఒక డోసు చొప్పున అమ్మే అవకాశముందని వివరించారు. తర్వాత ఇక్కడ తాము స్పుత్నిక్ వీ డోసులను ఉత్పత్తి చేస్తామని, అవి కొన్ని ఇక్కడ ప్రభుత్వానికి అమ్మడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తామని తెలిపారు. వీటి ధర నిర్ణయాలపై ఇంకా స్పష్టత రాలేదని, అయితే, పది డాలర్ల లిమిట్ కంటే తక్కువకే విక్రయిస్తామని వివరించారు. తమ ఉత్పత్తి మొదలయ్యాక ప్రభుత్వానికి ప్రైవేటుకూ టీకా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. స్పుత్నిక్ వీ టీకాను ద్రవరూపం, పౌడర్ రూపంలో నిల్వ చేసుకోవచ్చని, ద్రవ రూపంలోనైతే -18 డిగ్రీల దగ్గర, పౌడర్ రూపంలోనైతే 2-18 డిగ్రీల సెల్సియస్‌ల దగ్గర నిల్వ చేసుకోవచ్చేని అన్నారు.